Fight In Police Station Premises: గతంలో ఉన్న విభేదాలతో ఇరువర్గాల వారు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఫిర్యాదు మాట అటుంచి పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు ఆపినా లెక్క చేయకుండా దాడులు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫిర్యాదు చేసేందుకు వచ్చి ఠాణాలో ఘర్షణ.. పోలీసులు ఆపినా తగ్గేదేలే.. - వింజమూరు పోలీస్ స్టేషన్
Vinjamur Police Station వారిద్దరికీ అసలే పడదు. ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఆ ఇద్దరూ మళ్లీ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఎదురుపడ్డారు. ఇంకేముంది ఆగుతారా, మళ్లీ గొడవకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు ఆపినా తగ్గేదేలే అంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

two-categories-attacked-each-other-in-vinjamur-police-station-premises-video-viral
ఫిర్యాదు చేసేందుకు వచ్చి ఠాణాలో ఘర్షణ.. పోలీసులు ఆపినా తగ్గేదేలే..
ఏపీలోని నెల్లూరు జిల్లా వింజమూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ పత్రిక విలేకరి, వైకాపా నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. పాత గొడవలతో ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చిన ఇద్దరు వ్యక్తులు, పోలీసుల ఎదుట తలపడ్డారు. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దాడి చేసుకున్న ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: