తెలంగాణ

telangana

ETV Bharat / crime

tractor Hit bike at pillalamarri : ట్రాక్టర్‌, బైక్‌ ఢీ.. అన్మదమ్ములు దుర్మరణం - తెలంగాణ వార్తలు

tractor Hit bike at pillalamarri : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిల్లలమర్రి వద్ద ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు సోదరులు మృతి చెందారు. మృతులు జంగాలపల్లి వాసులు శ్రీనివాస్‌, ప్రకాశ్‌గా గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అన్నదమ్ములిద్దరూ ఒకేసారి చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.

tractor Hit bike at pillalamarri , road accident
ట్రాక్టర్‌, బైక్‌ ఢీ

By

Published : Dec 21, 2021, 10:58 AM IST

Updated : Dec 21, 2021, 4:52 PM IST

tractor Hit bike at pillalamarri : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం పిల్లలమర్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. ట్రాక్టర్-ద్విచక్రవానం ఢీకొన్న ఘటనలో... ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు ప్రాణాలొదిలారు. ఇల్లందు నుంచి జంగాలపల్లికి అటవీ మార్గం గుండా వెళ్తున్నవారిని మొద్దులతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ట్రాక్టర్ ముందు టైరు పగిలి పోయింది. మృతులు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జంగాలపల్లివాసులు శ్రీనివాస్, భాను ప్రకాష్‌గా గుర్తించారు.

ఈ ప్రమాదంలో భానుప్రకాష్ అక్కడిక్కడే మృతిచెందగా.. శ్రీనివాస్‌ ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఎరువులు కొనుక్కుని తిరుగు ప్రయాణంలో అన్నదమ్ములు మరణించారు. అన్నదమ్ములిద్దరూ ఒకేసారి చనిపోవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటన అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:Cyber Crime mails: సైబర్​ మోసాల్లో నయా ట్రెండ్​.. ఆ మెయిల్స్​తో జాగ్రత్త..!

Last Updated : Dec 21, 2021, 4:52 PM IST

ABOUT THE AUTHOR

...view details