కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం సింగీతం గ్రామంలో విషాదం జరిగింది. చేపలు వేటకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన పట్లోల శ్రీకాంత్(14), పట్లోల సంతోష్(16) అన్నదమ్ముల పిల్లలు.
చేపల వేటకు వెళ్లిన అన్నదమ్ములు మృతి - చేపల వేటకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి
చేపల వేటకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం సింగీతం గ్రామంలో జరిగింది.
కామారెడ్డి వార్తలు
బుధవారం మధ్యాహ్నం సమయంలో గ్రామంలోని చెరువులో చేపలవేటకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గుర్తించిన స్థానికులు పిల్లలిద్దరినీ బయటకు తీసి హుటాహుటిన బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. చెరువులో జేసీబీ తీసిన గుంతల వల్లనే తమ బిడ్డలు మృతిచెందారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చేతికందొచ్చిన పిల్లల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.