నల్గొండ జిల్లా త్రిపురారంలో రెండు బైక్‌లు ఢీకొని మంటలు చెలరేగాయి. ఘటనలో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బాబుసాయిపేటకు చెందిన కాటేపల్లి మల్లయ్య.. దుకాణంలో పెట్రోల్ అమ్మేందుకు బైక్‌పై వెళ్తున్నాడు. ఆ సమయంలో త్రిపురారం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది.
Accident: బైక్‌పై పెట్రోల్‌తో ప్రయాణం.. చేసింది పెద్ద గాయం.! - two bikes collided news
నల్గొండ జిల్లా త్రిపురారంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని మంటలు చెలరేగాయి. ఘటనలో ఒక వాహనదారునికి తీవ్రగాయాలయ్యాయి.
మంటల్లో బైక్
ప్రమాదంలో బైక్ రోడ్డుపై పడటంతో పెట్రోల్ కారణంగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు మల్లయ్యకు అంటుకోవడంతో... అతని శరీరం కాలిపోయింది. పక్కనే ఉన్న దాబా సిబ్బంది వెంటనే స్పందించి మంటలు ఆర్పినప్పటికీ... అప్పటికే మల్లయ్య తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:Gachibowli Accident: సరదాగా సాగిన వాళ్ల ఫ్రెండ్‌షిప్‌డే.. తీరని విషాదంతో ముగిసింది