తెలంగాణ

telangana

ETV Bharat / crime

Ganza Seized: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.. - గంజాయి పట్టివేత

Ganza Seized: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఓ ఇంటిపై దాడిచేసి ఇద్దరు బిహార్ వాసులను అబ్కారీ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 720 గ్రాముల ఎండుగంజాయి, మూడు చరవాణీలు, పది వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ganja seized
గంజాయి పట్టివేత

By

Published : Feb 10, 2022, 1:30 PM IST

Ganza Seized: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీలో ఓ ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో అబ్కారీ సీఐ సీతారామిరెడ్డి తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 550 గ్రాముల గల ఎండుగంజాయి ప్యాకెట్, అలాగే 10 గ్రాములు కల్గిన మరో 17 ప్యాకెట్లను పట్టుకన్నామని తెలిపారు. ఈ దాడుల్లో మొత్తం 720 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఎక్కడ నుంచి కొనుగోలు చేసారంటే...

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన ఓ గుర్తుతెలియని వ్యక్తి వద్ద నుంచి బిహార్​కు చెందిన సంజయ్ సాహ, జయప్రకాష్ గుప్తలు ఎండుగంజాయిని కొనుగోలు చేసి పటాన్​చెరు శ్రీరాంనగర్​లో విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అబ్కారీ అధికారులు ఇద్దరి బిహారీలను అదుపులోకి తీసుకుని వారివద్ద ఉన్న 720 గ్రాముల గంజాయి, మూడు చరవాణులు, రూ. పది వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో గంజాయి విక్రయిస్తున్నామని నిందితులు ఇద్దరు ఒప్పుకోవడంతో రిమాండ్‌కు తరలించినట్లు అబ్కారీ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల వద్ద గంజాయి పెంపకం...

ABOUT THE AUTHOR

...view details