సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను అబ్కారీ అధికారులు అరెస్ట్ చేసి వారి నుంచి 6.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పటాన్ చెరు యాక్సిస్ బ్యాంకు సమీప మార్కెట్కు వెళ్లే రహదారిలో ఇద్దరు వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారని అబ్కారీ అధికారులకు సమాచారం అందింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
పటాన్ చెరులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్ - patancheru ganja selling news
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో గంజాయి విక్రయిస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వీరి నుంచి 6.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ganja
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మల్కాపూర్ కు చెందిన ప్రేమ్ కుమార్, పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ కు చెందిన రేణు దేవిలుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి 6.5 కిలోల గంజాయి, మూడు చరవాణీలు, రూ. 10,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. రేణుదేవి, ప్రేమ్ కుమార్కు గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. వీరిద్దరిని అబ్కారీ అధికారులు రిమాండ్కు తరలించారు.