కోవిఫర్ మెడిసిన్‌ను అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బీఎన్ రెడ్డిలోని ఓ మెడికల్ షాపులో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో తనిఖీలు చేపట్టి... నిందితులను అరెస్టు చేశామని చెప్పారు.
కోవిఫర్ అక్రమ విక్రయం.. ఇద్దరు అరెస్ట్ - తెలంగాణ వార్తలు
కోవిఫర్ మెడిసిన్‌ను అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అధిక ధరకు విక్రయిస్తున్నారనే సమాచారంతో ఆ దుకాణంలో తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
కొవిఫర్ అక్రమ విక్రయం, కొవిఫర్ అక్రమం విక్రయం కేసులో ఇద్దరు అరెస్ట్
ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా మందులను అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేరంలో దుకాణ యజమాని పైడిషెట్టి రాజేశ్, మరో వ్యక్తి గంగాభరి మహేశ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:మూడో దశ ముప్పు.. ముందే గుర్తించొచ్చంటోన్న శాస్త్రవేత్తలు