తెలంగాణ

telangana

ETV Bharat / crime

వైద్యురాలి కిడ్నాప్​ కేసులో కొత్త ట్విస్ట్​.. పోలీసుల ఎదుట ప్రత్యక్షమైన ఇద్దరు - మలుపులు తిరుగుతున్న డాక్టర్​ కిడ్నాప్​ కేసు

DOCTOR KIDNAP CASE UPDATE: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ వైద్యురాలిని కొంతమంది కిడ్నాప్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మోహన్‌రెడ్డి కాలనీలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వైద్యురాలి కుటుంబసభ్యులే పథకం ప్రకారం కిడ్నాప్‌ చేయించారనే ఆరోపణల నడుమ.. వైద్యురాలు తిరిగి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.

DOCTOR KIDNAP
DOCTOR KIDNAP

By

Published : Oct 7, 2022, 6:43 PM IST

ఆసక్తికరంగా మారిన డాక్టర్​ కిడ్నాప్​ కేసు.. తప్పించుకుని పోలీసుల చెంతకు చేరిన జంట

DOCTOR KIDNAP CASE UPDATE: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లిలో కిడ్నాప్‌నకు గురైన డాక్టర్ సుష్మ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. గుంటూరుకి చెందిన ఓ వైకాపా కార్పొరేటర్ కుమార్తె సుష్మ అని.. వారి కుటుంబసభ్యులే ఆమెను తీసుకెళ్లారని ఉదయం ఆమె అత్త సుమతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుచ్చినాయుడుపల్లికి చెందిన తన కుమారుడు మోహనకృష్ణ-సుష్మ రెండు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారని తెలిపారు. ఇది ఇష్టం లేని అమ్మాయి కుటుంబసభ్యులు.. రాత్రి ఇంటిపై దాడి చేసి సుష్మను తీసుకెళ్లారని వాపోయారు.

తనకు, తన కుమారుడు మోహనకృష్ణకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత సుష్మ గుంటూరు నుంచి తప్పించుకుని మళ్లీ తిరుపతికి వచ్చింది. భర్తతో కలిసి ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డిని ఆశ్రయించింది. తమ కుటుంబసభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరినట్లు తెలిసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details