ఏపీలోని గుంటూరు జిల్లా వినుకొండ రూరల్ మండలం చీకటి గల పాలెం వైజంక్షన్ సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని అతిక్రమించే క్రమంలో ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్‌తో సహా 19 మందికి గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు - rtc bus sccident news
ఏపీలోని గుంటూరు జిల్లా వినుకొండ శివారులోని చీకటి గల పాలెం వద్ద.. తెలంగాణ నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 20 మంది గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులతో ఏపీలోని ప్రకాశం జిల్లా వింజమూరుకు బయలుదేరింది. వినుకొండ డిపోకు చేరుకునే సమయానికి బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. చీకటి గల పాలెం సమీపంలో కారంపూడి నుంచి నంద్యాల వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. క్షతగాత్రులను 108 సిబ్బంది సహాయంతో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనా స్థలంలో రోడ్డుపై అడ్డంగా ఉన్న బస్సును జేసీబీ సాయంతో పక్కకు తొలగించి.. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
- ఇదీ చదవండి :ఇసుక అక్రమంగా తెచ్చాడు.. పశువులపాకతో దాచాడు..