ఏపీలోని చిత్తూరు జిల్లా యాదమరి మండలం గోందివాండ్లవూరు గ్రామానికి చెందిన క్వారీ, గ్రానైట్ ఫ్యాక్టరీ యజమాని భజలింగంను 2016 జనవరి ఐదో తేదీన ఓ కిడ్నాప్ ముఠా అపహరించారు. ఈ ఘటనపై యాదమరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో దేవల్ల రాజేష్, భరత్ కుమార్ రెడ్డి, పుల్లూరు మురళి, నక్కల హేమాద్రి, అవసాని సుదర్శన్, గుండ్లూరి విజయకుమార్, ముత్తుకూరు హేమచంద్ర, అనంగి నందకుమార్, నక్కల రాజశేఖర్, అనంగి నరేష్, చింతపర్తి భరత్ కుమార్, చితగీరు దొరబాబులను పోలీసులు అరెస్టు చేశారు.
అపహరణ కేసులో 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష
ఏపీలోని చిత్తూరు జిల్లా యాదమరికి చెందిన ఓ గ్రానైట్ వ్యాపారి అపహరణ కేసులో పన్నెండు మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈ మేరకు తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి సూర్య నారాయణ మూర్తి తీర్పునిచ్చారు.
చిత్తూరు, యావజ్జీవ శిక్ష, చిత్తూరు వార్తలు
వీరందరూ... డబ్బు ఉన్న ధనికులు, వారి కుటుంబ సభ్యులను అపహరించి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.29 లక్షలు, రెండు ద్విచక్రవాహనాలు, ఒక టాటా సుమో వాహనం, ఒక బంగారు ఉంగరం స్వాధీనం చేసుకున్నారు.
- ఇదీ చదవండి :వెంటపడి కత్తులతో నరికి యువకుడి దారుణ హత్య