CBI Special court Judgement: గృహరుణాల పేరుతో తప్పుడు వివరాలు, డాక్యుమెంట్లతో మోసం చేసిన కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపి తీర్పునిచ్చింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బొల్లారం శాఖలో 2002 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు గృహ రుణాల పేరిట 98 లక్షల 43 వేల రూపాయల మోసం జరిగినట్లు 2004లో సీబీఐ కేసు నమోదు చేసింది. తప్పుడు పూచీకత్తులు, డాక్యుమెంట్లతో రుణాలు పొంది తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకుకు నష్టం జరిగినట్లు దర్యాప్తులో సీబీఐ తేల్చింది.
CBI Special court latest news: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పటి బ్రాంచి మేనేజరు కె.రాజారావు సహా 12 మందిపై 2006లో సీబీఐ మూడు ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం 12 మందిని దోషులుగా తేల్చి జైలు శిక్ష, అందరికీ కలిపి 11 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.