తెలంగాణ

telangana

ETV Bharat / crime

బాలికలపై ట్యూషన్​ టీచర్​ లైంగిక వేధింపులు.. చితకబాదిన స్థానికులు - tuition teacher harassment on girls

Tuition Teacher Sexually Assaulted: ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా ఎంతో గర్వంగా మహిళా దినోత్సవం జరుపుకొంటున్నాం. వివిధ రంగాల్లో అభ్యున్నతి సాధించిన మహిళలను సత్కరించుకుంటున్నాం. వారిని సన్మానించుకుంటున్నాం. కానీ పురుషులతో సమానంగా వారు స్వయంకృషితో పనిచేస్తున్నా.. నేటి సమాజంలో వారిపై వివక్ష మాత్రం తగ్గడం లేదు. అప్పుడే పుట్టిన పసికందు నుంచి.. పండు ముదుసలి వరకూ వారిని ఒక ఆటబొమ్మలాగే చూస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే పటాన్​చెరులో చోటుచేసుకుంది.

tuition teacher sexually assaulted on girls
చిన్నారులపై లైంగిక వేధింపులు

By

Published : Mar 7, 2022, 10:55 PM IST

Tuition Teacher Sexually Assaulted: రోజూ స్కూల్​ అయిపోగానే.. ఇంటికి వచ్చి త్వరత్వరగా రెడీ అయి.. అమ్మ పెట్టిన స్నాక్స్​ తిని.. బ్యాగ్​ సర్దుకుని స్నేహితులతో కలిసి ట్యూషన్​కు వెళ్లే కూతురు.. ఈ రోజు ఎందుకో వెళ్లలేదు. ట్యూషన్​కు వెళ్లకుండా.. ఇంటి బయటనే ఆడుకుంటోంది. తన ఫ్రెండ్స్​ అడిగినా ఈ రోజు రానని సమాధానం చెప్పింది. ఆరోగ్యం బాగాలేదేమో అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ కాసేపటికే ఇంటికి వచ్చిన తండ్రి.. కూతురు ఇంట్లోనే ఉండటం చూసి.. ట్యూషన్​కు ఎందుకు వెళ్లలేదని అడిగారు. తర్వాత తన బిడ్డ చెప్పిన సమాధానం విని ఆగ్రహానికి లోనయ్యారు. ఏ తండ్రయినా అలాంటి మాటలు విని భరించలేరు. ఆ సమయంలో అతని పరిస్థితి కూడా అంతే. వెంటనే తన తోటి వారిని తీసుకొని బయటకు వెళ్లారు. కట్​ చేస్తే.. ట్యూషన్​ నిర్వాహకుడిని కాళ్లతో తన్నుతూ చితకబాదుతూ కనిపించారు. అసలేం జరిగిందంటే..

రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్​గా పనిచేస్తున్న సాల్మన్ రాజు.. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండల పరిధిలో ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. స్థానికంగా ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు, విద్యార్థినిలు అతని వద్దకు ట్యూషన్ చెప్పించుకునేందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో ఓ బాలిక ట్యూషన్​కి వెళ్లకుండా ఇంటి వద్దనే ఆడుకుంటోంది. ఇది గమనించిన తండ్రి.. ఎందుకు వెళ్లలేదని కూతురిని అడగడంతో అసలు విషయం బయటపడింది.

చితకబాదిన స్థానికులు

ట్యూషన్ నిర్వాహకుడు సాల్మన్ రాజు చిన్న పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాలిక తండ్రికి చెప్పింది. అలాగే సెల్ఫీలు తీస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన తండ్రి.. స్థానికులతో కలిసి సాల్మన్ రాజును నిలదీశారు. అతనిపై పిడుగుద్దులు కురిపిస్తూ.. కింద పడేసి కాళ్లతో తన్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు కొట్టిన దెబ్బలకు నిందితుడు గాయపడటంతో పటాన్​చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సాల్మన్​రాజు మాత్రం తనను అపార్థం చేసుకుని కొట్టారని చెబుతున్నాడు.

ఇదీ చదవండి:Rape on minor girl: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం... పెళ్లి పేరుతో అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details