ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిగురుపల్లి సమీపంలో ఓ మహిళ మృతదేహాన్ని కాణిపాకం పోలీసులు గుర్తించారు. మృతురాలు తితిదే ఉద్యోగి సరోజమ్మ(59)గా పోలీసులు తెలిపారు. స్వీపరుగా తిరుమలలో విధులు నిర్వర్తిస్తున్న సరోజమ్మ.. గత నెల 31వ తేదీన అదృశ్యమైంది. ఆమె కనిపించటం లేదంటూ కుటుంబసభ్యులు.. తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు కింద నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
తితిదే ఉద్యోగిని అనుమానాస్పద మృతి.. దర్యాప్తు ముమ్మరం - ttd murder news
ఏపీలోని చిత్తూరు జిల్లా చిగురుపల్లి సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తితిదేలో స్వీపరుగా పనిచేస్తోన్న ఆమె.. గత నెల 31వ తేదీన అదృశ్యమైంది. ఇప్పుడు శవంగా కనిపించడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తితిదే ఉద్యోగిని అనుమానాస్పద మృతి
చిగురుపల్లి సమీపంలో సరోజమ్మ మృతదేహాన్ని గుర్తించిన కాణిపాకం పోలీసులు.. తిరుమల పోలీసులకు సమాచారం అందించారు. తితిదేలో పనిచేస్తున్న ఓ ఒప్పంద ఉద్యోగి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. సరోజమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
ఇదీ చదవండి:వివాహ వేడుకలో ఘర్షణ... నృత్యం చేస్తుండగా యువకుడికి కత్తిపోట్లు