కంటైనర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, ఏడుగురికి గాయాలు - jadcherla rtc bus accident
07:06 January 13
RTC Bus Accident at Jadcherla : కంటైనర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. పొగమంచే కారణం!
RTC Bus Accident at Jadcherla : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ను.. ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి.
RTC Bus Hits Container at Jadcherla : తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న తిరుపతి డిపో బస్సుకు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులు ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన డ్రైవర్ను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. డ్రైవర్ మృతితో.. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి సమయం పట్టింది. మరో ఆర్టీసీ డ్రైవర్ను రప్పించి ప్రయాణికులను వేరే బస్సులో వారి వారి గమ్యస్థానాలకు పంపించారు. ప్రమాదానికి గల కారణం పొగమంచేనని భావిస్తున్నారు. పొగమంచు వల్ల దారి కనబడక.. ఆర్టీసీ డ్రైవర్ కంటైనర్ను ఢీకొట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.