తెలుగు అకాడమీ నిధుల(Telugu Academy Funds scam) గోల్‌మాల్ కేసులో ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతోంది. నారాయణగూడలోని అకాడమీ కార్యాలయానికి చేరుకున్న కమిటీ... తెలుగు అకాడమీ సంచాలకుడు సోమిరెడ్డితో పాటు మరికొంత మందిని ప్రశ్నించింది. రూ. 43 కోట్లు బ్యాంకు నుంచి ఏ విధంగా విత్‌డ్రా అయ్యాయని కమిటీ సభ్యులు ఆరా తీస్తున్నారు. 3గంటల పాటు కమిటీ సభ్యులు అకాడమీ(Telugu Academy Funds scam) కార్యాలయంలో విచారణ కొనసాగించారు.
అంతకుముందుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI) అధికారులను కూడా త్రిసభ్య కమిటీ విచారించింది. బ్యాంకుకు చెందిన రికార్డులను సభ్యులు పరిశీలించారు. మరో వైపు సీసీఎస్ పోలీసులూ ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే నిధుల గోల్‌మాల్‌లో బ్యాంకు అధికారుల పాత్రే ఉందని తెలుగు అకాడమీ(Telugu Academy Funds scam) అధికారులు చెబుతున్నారు. కానీ బ్యాంకు అధికారులు మాత్రం అకాడమీ సిబ్బందే డబ్బులు విత్‌డ్రా చేశారని అంటున్నారు. ఇందుకు సంబంధించి అకాడమీ అధికారులపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భారీ స్కామ్
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల నగదు గోల్‌మాల్ అయ్యింది(Telugu Academy Funds scam). యూబీఐ బ్యాంక్‌లో తాము డిపాజిట్ చేసిన రూ.43కోట్లు బ్యాంకులో లేవని అకాడమీ ప్రతినిధులు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగు అకాడమీలోని వ్యక్తులే వాటిని విత్‌డ్రా చేసుకున్నారంటూ యూబీఐ ఉన్నతాధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగు అకాడమీ తమ వద్ద ఉంచిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల మొత్తం రూ.54.41కోట్లుగా బ్యాంక్ అధికారులు పోలీసులకు తెలిపారు. రెండు ఫిర్యాదులపై కేసులు నమోదు చేసుకున్న బ్యాంక్ అధికారులు, తెలుగు అకాడమీ ప్రతినిధులను విచారించిన అనంతరం దర్యాప్తు మొదలు పెట్టనున్నారు.