అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఆరుగురిని ఆబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి 34.7 కిలోల గంజాయి, ఒక ఆటో, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు - గోల్కొండ పోలీస్‌స్టేషన్
గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ గుడిమల్కాపూర్ వద్ద చోటుచేసుకుంది. వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి తరలిస్తున్న ఆరుగురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్టు
వాహనాలు తనిఖీ చేస్తుండగా గుడిమల్కాపూర్ వద్ద ఆటోలో గంజాయి దొరికిందని ఆబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఏస్ అంజిరెడ్డి పేర్కొన్నారు. అరెస్టైన వారిలో నలుగురు ఒడిశాకు చెందిన వారని ఆయన వెల్లడించారు. కేసు నమోదు చేసి గోల్కొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు వివరించారు.
ఇదీ చూడండి :చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్
Last Updated : Feb 25, 2021, 10:53 PM IST