ఈశ్వరరావుతో వాగ్వాదానికి దిగారు. ఇదే క్రమంలో.. గొడవ కాస్తా ఘర్షణగా మారింది. ట్రాన్స్జెండర్లు అంతా కలిసి సెక్యూరిటీ గార్డుపై మూకుమ్మడి దాడికి దిగారు. పైపులు, కుర్చీలు.. చేతికి ఏది దొరికితే దానితో.. ఈశ్వరరావును రక్తమొచ్చేలా చితకబాదారు. ఈశ్వరరావుతో పాటు విధుల్లో ఉన్న ఇంకో సెక్యూరిటీ గార్డు ఎంత ఆపినప్పటికీ ఆగకుండా.. అతనిపై కూడా దాడి చేస్తూనే ఉన్నారు. వేరే వ్యక్తి వచ్చి మందలించినప్పటికీ.. తిరిగి అతనిపైకి విరుచుకుపడ్డారు. సెక్యూరిటీ గార్డుపై కోపం తీర్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సెక్యూరిటీగార్డుపై ట్రాన్స్జెండర్ల వీరంగం.. సీసీకెమెరా దృశ్యాలు వైరల్.. - సెక్యూరిటీగార్డుపై ట్రాన్స్జెండర్స్ ప్రతాపం
Transgenders attack: గెటెడ్ కమ్యూనిటీలోకి అనుమతించనందుకు ఓ సెక్యూరిటీగార్డుపై ట్రాన్స్జెండర్స్ తమ ప్రతాపం చూపించారు. సెక్యూరిటీగార్డుపై మూకుమ్మడిగా దాడి చేసి.. ఇష్టమున్నట్టు కొట్టారు. ఈ దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

transgenders attack on security guard in pragathinagar royal village colony
సెక్యూరిటీగార్డుపై ట్రాన్స్జెండర్ల వీరంగం
అనంతరం.. బాచుపల్లి పోలీస్స్టేషన్లో ఈశ్వర్రావు ఫిర్యాదు చేశాడు. కాలనీలోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఆపినందుకు.. తనపై దాడి చేశారని.. ఆఫీస్ ఫర్నీచర్ ధ్వంసం చేశారని ఫిర్యాదులో తెలిపాడు. దాడి సమయంలో డయల్ 100కు ఫోన్ చేయగా.. తాము అందుబాటులో లేమని పోలీస్ సిబ్బంది బదులిచ్చినట్టు ఈశ్వర్రావు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. దాడికి సంబంధించి.. అక్కడే ఉన్న సీసీకెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా విచారణ చేస్తున్నారు.
ఇవీ చూడండి: