తన భర్త రూ.5 లక్షల వరకట్నం తీసుకురావాలంటూ వేధింపులకు గురిచేస్తున్నాడని ఓ ట్రాన్స్జెండర్ హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఏపీలోని ఏలూరుకి చెందిన తారక మహష్ తన భర్తని తెలిపింది. తాను ట్రాన్స్జెండర్నని.. పిల్లలు కలగరని చెప్పినా పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది.
నా పేరు ఏడుకొండలు చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్కు వచ్చేశాను. ఎంబీఏ పూర్తిచేశాను. అనంతర క్రమంలో శస్త్రచికిత్స చేయించుకొని ట్రాన్స్జెండర్ (భూమి)గా మారాను. మూడేళ్ల క్రితం ఏలూరుకు చెందిన తారక మహేష్.. ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. అదికాస్త ప్రేమగా మారింది. తాను ట్రాన్స్జెండర్నని చెప్పినా వివాహం చేస్తుకుంటానన్నాడు. 2018 జనవరిలో పెళ్లి చేసుకున్నాం. అప్పటి నుంచి వారానికి రెండు రోజులు తన దగ్గరికి వచ్చేవాడు. వివాహ వార్షికోత్సవం రోజున రూ.5 లక్షలు వరకట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. లేకుంటే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు. నాకు భర్త కావాలి. న్యాయం చేయండి.