తెలంగాణ

telangana

ETV Bharat / crime

Transformer blast at Nampally : నాంపల్లిలో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణాపాయం - హైదరాబాద్​ లో ట్రాన్స్​ఫార్మర్​ పేలుడు

Transformer blast at Nampally : నాంపల్లి రెడ్​హిల్స్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ట్రాన్స్​ఫార్మర్ పేలడం వల్ల పక్కన ఉన్న అపార్ట్​మెంట్​లోకి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో అపార్ట్​మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

Nampally Transformer blast at hyderabad
నాంపల్లి లో అగ్ని ప్రమాదం

By

Published : Feb 5, 2022, 1:36 PM IST

Transformer blast at Nampally : హైదరాబాద్​లోని నాంపల్లి రెడ్ హిల్స్​లో అగ్నిప్రమాదం జరిగింది. ట్రాన్స్​ఫార్మర్ పేలి పక్కన ఉన్న అపార్ట్​మెంట్​లోకి మంటలు వ్యాపించాయి. పెద్ద శబ్దం రావడంతో ఒక్క సారిగా ఉలిక్కిపడ్డ అపార్ట్​మెంట్ వాసులు బయటకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం జరకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

ఇదీ చదవండి :Illegal water connection in Hyderabad : గ్రేటర్​లో అక్రమ నల్లా కనెక్షన్లపై ఉక్కుపాదం

ABOUT THE AUTHOR

...view details