తెలంగాణ

telangana

ETV Bharat / crime

ROAD ACCIDENT IN PEDDAPALLI : కొద్ది నిమిషాల్లో ఇల్లు చేరుకుంటారనగా ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు మృతి - Peddapalli Road Accident Today

ROAD ACCIDENT IN PEDDAPALLI: కొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన యువకులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. వారు వెళ్తున్న బైక్​ను ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

ROAD ACCIDENT IN PEDDAPALLI
పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం

By

Published : Feb 5, 2022, 1:41 PM IST

ROAD ACCIDENT IN PEDDAPALLI: పెద్దపల్లి జిల్లాలోని హనుమంతుని పేట గ్రామ శివారులో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అసలేం జరిగిందంటే..

Peddapalli Road Accident Today : పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన కోరే గణేశ్, ఆశ్విత్​లు జిల్లా కేంద్రం నుంచి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. హనుమంతునిపేట గ్రామ శివారుకు చేరుకోగానే.. ఈ యువకులు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటో ఢీకొట్టింది. అనంతరం చెట్టును ఢీకొంది.

ఇద్దరు యువకులు మృతి

ఈ ప్రమాదంలో పెగడపల్లి గ్రామానికి చెందిన గణేశ్, ట్రాలీ ఆటో డ్రైవర్ నరసయ్య వాహనంలో ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందారు. బైక్​పై ఉన్న మరో యువకుడు అశ్విత్​కు తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పెద్దపెల్లి ఎస్సై రాజేశ్ ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండీ:Married Women Suicide: వరకట్న వేధింపులకు గర్భవతి, 18 నెలల పాపబలి..

ABOUT THE AUTHOR

...view details