LIVE VIDEO: డీజే ఆపినందుకు ట్రైనీ ఎస్సైపై యువకుల దాడి - young men attacked trainee si in nalgonda
10:46 June 15
నల్గొండ: డిండి మం. బురాన్‌పూర్ తండాలో ట్రైనీ ఎస్సైపై దాడి
నల్గొండ జిల్లా డిండి మండలం బురాన్‌పూర్ తండాలో దారుణం చోటుచేసుకుంది. పెట్రోలింగ్‌లో భాగంగా.. సోమవారం రాత్రి బురాన్‌పూర్ తండా వెళ్లిన పోలీసులు.. అక్కడ జరుగుతున్న ఓ వివాహ వేడుకలో కొందరు యువకులు గుంపులు గుంపులుగా చేరి.. డీజే పెట్టుకుని నృత్యాలు చేయడం గమనించారు.
కరోనా వ్యాప్తి దృష్ట్యా విధించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని వారిని పోలీసులు హెచ్చరించారు. నృత్యాలు ఆపివేయాలని ఆదేశించారు. ఇదేం లెక్కచేయని యువకులు ట్రైనీ ఎస్సై కిరణ్‌పై చేయి చేసుకున్నారు. అంతటితో ఆగలేదు. పోలీసు వాహనంపై అక్కడే ఉన్న కుర్చీలతో దాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది.అతి కష్టం మీద పోలీసులు అక్కడి నుంచి బయటపడాల్సి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పోలీసులపై దాడికి దిగిన 10 మంది యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు