ఏపీలోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో విషాదం జరిగింది. బావిలో దూకి తల్లీ, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది చిన్నారితో కలిసి ఓ తల్లి బావిలో దూకింది.
కుటుంబ కలహాలతో కుమారునితో సహా తల్లి బలవన్మరణం - mother-son suicide News
అనాలోచితంగా, క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. కుటుంబ కలహాల పేరుతో.. తాము ప్రాణాలు తీసుకోవడమే కాకుండా అభంశుభం తెలియని చిన్నారుల బంగారు భవిష్యత్తును అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఓ తల్లీ తన బిడ్డతో సహా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
dead
నిన్నటి నుంచి తల్లీ, బిడ్డ కనిపించకుండా పోయారు. ఇవాళ బావిలో విగతజీవులుగా తేలారు. కుటుంబ కలహాలే కారణమని వారి బంధువులు చెబుతున్నారు. మృతురాలిని మేకలబండకు చెందిన శ్రావణిగా పోలీసులు గుర్తించారు.