Traffic Jam on Rudraram Highway: ఒక వాహనదారుడి నిర్లక్ష్యం.. సుమారు 10 వాహనాల ప్రమాదానికి కారణమైంది. సంగారెడ్డి జిల్లా రుద్రారం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కారు రాంగ్‌రూట్‌లో వెళ్లి మరో కారును ఢీకొట్టింది. దీంతో ఆ కారు వెనకాలే ఉన్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. మొత్తం ఓ లారీ, 3 వ్యాన్లు, 5 కార్లు ప్రమాదానికి గురయ్యాయి.
ఘటనలో రాంగ్‌రూట్‌లో వెళ్లిన కారులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్‌బెలూన్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం కారణంగా జహీరాబాద్, షోలాపూర్ నుంచి వచ్చే మార్గాల్లో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. రహదారిపై హైదరాబాద్ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది.