బంగారం స్మగ్లింగ్ కేసులో ఘన శ్యామ్ జ్యువెల్లర్స్ యజమాని కుమారుడు ప్రీత్ కుమార్ అగర్వాల్‌ను ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. ఎగుమతి చేసే బంగారాన్ని నిబంధనలకు విరుద్ధంగా దేశీయంగా అమ్మి సొమ్ము చేసుకున్నట్టు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది.
250 కిలోల గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఓ వ్యాపారి అరెస్టు
17:41 March 11
250 కిలోల గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఓ వ్యాపారి అరెస్టు
కోల్‌కత్తాలో డీఆర్ఐ అధికారులు తనిఖీ చేపట్టగా దాదాపు 250 కిలోల బంగారాన్ని పలు ఏజెన్సీల నుంచి కొనుగోలు చేసి.. వాటిని ఎలాంటి పన్ను కట్టకుండా పలువురికి విక్రయించినట్లు గుర్తించారు. హవాలా మార్గంలో తరలించినట్లు తేలడంతో డీఆర్ఐ అధికారుల ఫిర్యాదు మేరకు ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు.
హైదరాబాద్‌లోని ఐదు చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సుంకం ఎగవేసి భారీ ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు.
ఇదీ చూడండి :లైవ్ వీడియో: తప్పించుకోబోయి విద్యార్థిని మృతి