మంచిర్యాల జిల్లా భీమిని మండలం జగ్గయ్యపేట సమీపంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆసిఫాబాద్ జిల్లా చింతగూడకు చెందిన డ్రైవర్ చాండ్ పాషా(30) ఘటనా స్థలంలోనే మరణించగా... అతని వెంట ఉన్న ఇందూరి రవి(35)ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని ఎస్ఐ కొమురయ్య తెలిపారు.
పల్టీ కొట్టిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి - jaggayyapet tractor accident
అతివేగంతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జగ్గయ్యపేట సమీపంలో జరిగింది.
పల్టీ కొట్టిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి
వారు కాగజ్నగర్ మండలం అందవెల్లి నుంచి భీమిని మండలం వీగాంకు సిమెంటు, ఇటుకల లోడు తీసుకువచ్చారు. గ్రామంలో అన్లోడ్ చేసి తిరుగు పయనమయ్యారు. ఆ క్రమంలో జగ్గయ్యపేట సమీపంలో అతి వేగంగా ప్రయాణించడం వల్ల ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిందని పోలీసులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న తాండూరు సీఐ బాబురావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇదీ చూడండి :తక్కువ ధరకు వాహనాలు ఇస్తామంటూ చీటింగ్