తెలంగాణ

telangana

ETV Bharat / crime

ట్రాక్టర్ డ్రైవర్ హత్య.. వివాహేతర సంబంధమేనా!

ఓ ట్రాక్టర్​ డ్రైవర్​ను కత్తులతో పొడిచి పొడిచి చంపేశారు. హత్యకు కారణం వివాహేతర సంబంధంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Murder
ట్రాక్టర్ డ్రైవర్ హత్య

By

Published : Apr 6, 2021, 11:37 AM IST

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటలో కుందారపు విక్రమ్ అనే ట్రాక్టర్ డ్రైవర్​ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. ఒక పథకం ప్రకారం సాయంత్ర నుంచి నలుగురు వ్యక్తులు విక్రమ్​కు మద్యం తాగించి ఇంటికి పంపించారు. మళ్లీ రాత్రి వేళ విక్రమ్​ను ఇంటి నుంచి బయటకు రప్పించి.. గ్రామ శివారులోని జాతీయ రహదారి 365 పక్కన కత్తులతో పొడిచి హత్య చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. విక్రమ్ మరణవార్త తెలుసుకున్న బంధుమిత్రులు ఘటనా స్థలానికి చేరుకుని.. బోరున విలపించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నలుగురు అనుమానిత వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది.

ఇదీ చదవండి:'సైబర్‌' వలేస్తే.. ఖాతాదారు కత్తిరిస్తే..

ABOUT THE AUTHOR

...view details