తెలంగాణ

telangana

ETV Bharat / crime

రెచ్చిపోయిన విద్యార్థులు.. కత్తులతో ఫైటింగ్​ - Clashes between students in tirupati

Clashes among students at Gudur: ఏపీ తిరుపతిలోని గూడురు ఆదిశంకర కళాశాలలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు వర్గాలకు చెందిన విద్యార్థులు కత్తులతో దాడి చేసుకున్న ఘటనలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఇంత జరుగుతున్నా.. ఇలాంటి వాటిని అరికట్టేందుకు కాలేజీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

Clashes among students at Gudur
రెచ్చిపోయిన విద్యార్థులు.. కత్తులతో ఫైటింగ్​

By

Published : May 24, 2022, 8:18 PM IST

రెచ్చిపోయిన విద్యార్థులు.. కత్తులతో ఫైటింగ్​

Clashes among students at Gudur: ఏపీలోని తిరుపతి జిల్లా గూడూరు ఆదిశంకర కళాశాలలో విద్యార్థులు రెచ్చిపోయారు. కళాశాలలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ నేపథ్యంలో ఓ వర్గానికి మద్దతుగా బయట నుంచి ముగ్గురు వ్యక్తులు కత్తులతో కళాశాలకు వచ్చారు. దీంతో బయటి నుంచి వచ్చిన వారిని కళాశాల విద్యార్థులు చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటన జరిగిన రెండ్రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు గోప్యంగా ఉంచిన పోలీసులు.. ఘర్షణ దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్‌ కావడంతో కేసు నమోదు చేశారు. గూడూరులోని జాతీయ రహదారిపై ఉన్న ఆదిశంకర కళాశాల విద్యార్థుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. విద్యార్థులు కొట్టుకోవడం భయబ్రాంతులకు గురి చేసింది. ఇంత జరుగుతున్నా... కాలేజీ యాజమాన్యం మాత్రం పట్టించుకోడంలేదు. చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దాదాపుగా రెండు నెలల కాలంలో ఇలా గొడవ జరగడం మూడోసారి.

ABOUT THE AUTHOR

...view details