తెలంగాణ

telangana

ETV Bharat / crime

బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం.. తల్లిదండ్రులకు అప్పగింత - చిత్తూరు జిల్లా నేర వార్తలు

తిరుపతిలో అపహరణనకు గురైన ఛత్తీస్​గఢ్​కు చెందిన ఆరేళ్ల బాలుడి కథ సుఖాంతమయింది. తల్లిదండ్రులకు బాలుడిని పోలీసులు అప్పగించారు. బాలుడిని చూసిన తండ్రి బావోద్వేగానికి గురయ్యాడు.

బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం.. తల్లిదండ్రులకు అప్పగింత
బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం.. తల్లిదండ్రులకు అప్పగింత

By

Published : Mar 14, 2021, 10:52 PM IST

తిరుపతిలో అపహరణనకు గురైన ఛత్తీస్​గఢ్​కు చెందిన ఆరేళ్ల బాలుడి కథ సుఖాంతమయింది. .తల్లిదండ్రులకు బాలుడిని అప్పగించారు. ఆ చిన్నారిని చూసిన తండ్రి బావోద్వేగానికి గురయ్యాడు. బాలుడికి... పోలీసులు చాక్లెట్లు, బొమ్మలను బహుమతిగా ఇచ్చారు. తన కొడుకును సురక్షింతంగా అప్పగించినందుకు పోలీసులకు ఆ బాలుడి తండ్రి కృతజ్ఞతలు తెలిపాడు. అపహరణకు గురైనా 14 రోజుల తర్వాత బాలుడి ఆచూకీ విజయవాడలో లభ్యమైందని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు.

అసలేం జరిగిందంటే...

అలిపిరి బస్టాండ్‌ వద్ద గత నెల 27న ఛత్తీస్​గడ్​​కు చెందిన ఆరేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. అప్పటి నుంచి తిరుపతి అర్బన్ పోలీసులు బాలుడి కోసం అన్వేషించారు. వి.కోట ప్రాంతానికి చెందిన శివప్ప కిడ్నాపర్​ అని.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ​

తిరుపతిలో అపహరణకు గురైన బాలుడు సురక్షితంగా ఉన్నట్లు శనివారమే.. పోలీసులు తెలిపారు. విజయవాడ బస్టాండ్ పరిసరాల్లో బాలుడిని గుర్తించి.. చైల్డ్ లైన్ అధికారులకు అప్పగించామన్నారు. అనంతరం తిరుపతి అర్బన్ పోలీసులు, బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు చెప్పారు.

బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం.. తల్లిదండ్రులకు అప్పగింత

ఇవీచూడండి:ఓఆర్ఆర్‌పై రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details