తెలంగాణ

telangana

ETV Bharat / crime

Tipper accident at Batasingaram : టిప్పర్ బీభత్సం.. ఆర్టీసీ బస్సు, కారును ఢీకొట్టి పల్టీలు.. - తెలంగాణ వార్తలు

Tipper accident at Batasingaram : బాట సింగారం వద్ద మంగళవారం తెల్లవారుజామున టిప్పర్ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అదుపుతప్పి.. ఆర్టీసీ బస్సు, కారును ఢీకొంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి గాయాలయ్యాయి.

Tipper accident at Batasingaram, batasingaram accident
టిప్పర్ బీభత్సం.. ఆర్టీసీ బస్సు, కారును ఢీకొట్టి పల్టీలు..

By

Published : Jan 18, 2022, 12:19 PM IST

Updated : Jan 18, 2022, 1:38 PM IST

Tipper accident at Batasingaram : రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద టిప్పర్ బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున విజయవాడ జాతీయ రహదారిపై అదుపుతప్పి రోడ్డుకు అవతలివైపున బస్సు, కారును ఢీ కొట్టింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడకు చెందిన వంశీకృష్ణ కుటుంబ సభ్యులతో సంక్రాంతికి సొంత ఊరికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడినవారికి సోమజిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఒంగోలు కందుకూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బస్సును కూడా టిప్పర్ ఢీకొంది. అయితే బస్సులోని ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా, బస్సు ముందుభాగం దెబ్బతిన్నాయి.

టిప్పర్ బీభత్సం.. ఆర్టీసీ బస్సు, కారును ఢీకొట్టి పల్టీలు..

ఇదీ చదవండి:నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో 20 మంది పోలీసులకు కరోనా

Last Updated : Jan 18, 2022, 1:38 PM IST

ABOUT THE AUTHOR

...view details