మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ ఎదురుగా వచ్చిన కారును ఢీ కొట్టింది. ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా...మరో ఇద్దరు క్షతగాత్రులను ఆస్రత్రికి తరలించగా వారిలో మరొకరు మత్యువాత చెందారు.
టిప్పర్, కారు ఢీ.. ముగ్గురు మృతి - టిప్పర్ లారీ కారు ఢీ
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలం చౌళతండా సమీపంలో ప్రమాదవశాత్తు టిప్పర్ లారీ కారును ఢీ కొట్టింది. ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించగా.. వారిలో ఒకరు మరణించారు.
టిప్పర్ లారీ, కారు ఢీ.. ఇద్దరు మృతి
మంగనూర్కు చెందిన నలుగురు వ్యక్తులు మారుతీ కారులో భూత్పూర్ వైపు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. మంగనూరుకు చెందిన సత్యనారాయణ గౌడ్(35), వెంకటయ్య గౌడ్(47) అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి :భర్తను హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టిన భార్య