హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మట్టి లోడ్‌తో వెళ్తున్న ఓ టిప్పర్.. మెట్రో పిల్లర్‌ను వేగంగా ఢీ కొట్టి బోల్తా పడింది. ఘటన సమయంలో ట్రాఫిక్ తక్కువ ఉండటంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టిన టిప్పర్ - మెట్రో పిల్లర్‌ను వేగంగా ఢీ కొట్టి
మట్టి లోడ్‌తో వెళ్తున్న ఓ టిప్పర్.. మెట్రో పిల్లర్‌ను వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటన చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
![మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టిన టిప్పర్ Tipper hits Metro pillar in chadrghat hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10443989-280-10443989-1612065725102.jpg)
మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టిన టిప్పర్
సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో టిప్పర్ని తొలగించారు. డ్రైవర్ నిద్ర మత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిపారు.