Tiger killed a farmer: పెద్దపులి దాడితో రైతు మరణించిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వాంకిడి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన సీడాం భీమ్(69) అనే వ్యక్తి పత్తి చేనులో పత్తి తీసేందుకు వెళ్లగా.. పులి అకస్మాత్తుగా అతడిపై దాడికి పాల్పడి, కొండ ప్రాంతం నుంచి దిగువకు ఈడ్చుకెళ్లింది. దానితో భీమ్ అక్కడికక్కడే మరణించాడు. అదే పులి ఉదయం పూట పశువులు కాస్తున్న కాపరులకు కనిపించిందని వారు పెద్దగా కేకలు వేయడంతో అక్కడ నుంచి వెళ్లిపోయిందని స్థానికులు తెలియజేశారు.
పొలంలో ఉన్న రైతును ఈడ్చుకెళ్లి చంపిన పెద్దపులి..!
Tiger killed a farmer: పెద్దపులి దాడితో రైతు మరణించిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వాంకిడి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన సీడాం భీమ్(69) అనే వ్యక్తి పత్తి చేనులో పత్తి తీసేందుకు వెళ్లగా.. పులి అకస్మాత్తుగా అతడిపై దాడికి పాల్పడి, కొండ ప్రాంతం నుంచి దిగువకు ఈడ్చుకెళ్లింది. దానితో భీమ్ అక్కడికక్కడే మరణించాడు.
Tiger
ఆ సమయంలో ఫారెస్ట్ అధికారులు కూడా అదే ప్రాంతం చుట్టూ పక్కల పోడు భూముల సర్వే నిర్వహిస్తుండటంతో ఈ విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పులి దాడిలో మరణించిన భీమ్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారాన్ని వచ్చేలా చూస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: