నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శివాజీ నగర్లో టిఫిన్ సెంటర్ గోడ కూలి ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. పాత గోడ కావడంతో మరమ్మతులు చేస్తున్న సమయంలో కూలిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
టిఫిన్ సెంటర్ గోడ కూలి ముగ్గురికి తీవ్ర గాయాలు - తెలంగాణ వార్తలు
నిజామాబాద్ జిల్లాకేంద్రంలో టిఫిన్ సెంటర్ గోడ కూలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పాత గోడకు మరమ్మతులు చేసే క్రమంలో కూలినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరు కూలీలు, యజమాని ఉన్నారు.
టిఫిన్ సెంటర్ గోడ కూలి గాయాలు, నిజామబాద్‌లో కూలిన టిఫిన్ సెంటర్ గోడ
గాయపడిన వారిలో ఇద్దరు గోడ మరమ్మతులు చేసే కార్మికులు వెంకట్, సంజయ్గా గుర్తించారు. యజమానికీ గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకొన్న 2వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.