మహారాష్ట్ర ఠాణె జిల్లాలో(Maharashtra Thane News) దారుణం జరిగింది. కదులుతున్న రైలులోకి ప్రవేశించిన దుండగులు బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల వద్ద నుంచి డబ్బు, నగలు దోచుకోవడమే కాకుండా.. ఓ 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అసలేం జరిగింది?
లఖ్నవూ నుంచి ముంబయికి వెళ్తున్న పుష్పక్ ఎక్స్ప్రెస్లో దుండగులు శుక్రవారం రాత్రి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇగత్పురీ, కాసారా రైల్వే స్టేషన్ మధ్య కొండలపై ప్రయాణించే క్రమంలో రైలు వేగం నెమ్మదించింది. ఆ సమయంలో 8 మంది దుండగులు రైలులోని డీ-2 బోగిలోకి ప్రవేశించారు.
మారణాయుధాలను పట్టుకుని 10 నుంచి 20 మంది ప్రయాణికులను దుండగులు బెదిరించారు. వారి ఫోన్లను, నగలను , డబ్బులను లాక్కున్నారు. ఎదురుతిరిగిన ప్రయాణికులపై దాడి చేశారు. రైలులో ఉన్న ఓ 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు తెలిపారు.