Road Accident In VIsakha District: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకోజిపాలెం జంక్షన్ సమీపంలో అర్ధరాత్రి.. మద్దిలపాలెం వైపు వస్తున్న బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మృతులు ఎండాడకు చెందిన సాయి, దుర్గాప్రసాద్, గోపిలుగా గుర్తించారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్.. ముగ్గురు యువకులు మృతి - ఆంధ్రప్రదేశ్ వార్తలు
Road Accident In VIsakha District: ఏపీలోని విశాఖ జిల్లా వెంకోజిపాలెం జంక్షన్ సమీపంలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మద్దిలపాలెం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతులను ఆసుపత్రికి తరలించారు.
Road Accident In VIsakha District