తెలంగాణ

telangana

ETV Bharat / crime

వేడి నీళ్లు మీద పడి మూడేళ్ల చిన్నారి మృతి - వేడి నీళ్లు మీద పడి మూడేళ్ల చిన్నారి మృతి

వేడి నీళ్లు శరీరంపైన పడటంతో మూడేళ్ల చిన్నారి మృతి చెందాడు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా వేపల సింగారం గ్రామంలో చోటుచేసుకుంది.

boy died, vepala singaram
మూడేళ్ల చిన్నారి మృతి, వేపల సింగారం

By

Published : Feb 9, 2021, 11:57 AM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ మండలం వేపలసింగారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పొట్ట కరుణాకర్‌, పవిత్రల కుమారుడు మూడేళ్ల రాహుల్‌ సోమవారం సాయంత్రం ఆడుకుంటూ పొరపాటున.. పొయ్యిపై కాగుతున్న వేడి నీటి గిన్నెకు తగిలాడు. వేడి నీళ్లు మీద పడటంతో చిన్నారికి గాయాలయ్యాయి. వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.

ABOUT THE AUTHOR

...view details