తెలంగాణ

telangana

పండుగ పూట విషాదం.. గోదావరిలో ముగ్గురు గల్లంతు..

By

Published : Apr 2, 2022, 4:42 PM IST

Updated : Apr 2, 2022, 10:57 PM IST

three were washed away in godawari river at royyuru on festival day
three were washed away in godawari river at royyuru on festival day

16:21 April 02

పండుగ పూట విషాదం.. గోదావరిలో ముగ్గురు గల్లంతు..

Tragedy on festival: పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. ఉగాది సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతైన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరులో చోటుచేసుకుంది. గ్రామ దేవతను గంగ స్నానానికి తీసుకెళ్లిన సమయంలో.. ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులతో పాటు ఓ బాలుడు గోదావరిలో గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రొయ్యూరు గ్రామంలో లక్ష్మీదేవతకు గంగా స్నానం చేయించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామస్థులంతా కలిసి ఊరేగింపుగా గోదావరి ఒడ్డుకు బయలుదేరివెళ్లారు. అమ్మవారికి స్నానం చేయిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు.. ఇద్దరు యువకులు ఒక బాలుడు గోదావరిలో గల్లంతయ్యారు.

రొయ్యూరు గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువకులు... సతీశ్​, సాయివర్ధన్​తో పాటు.. 12 ఏళ్ల బాలుడు గోదావరిలో కనిపించకుండా పోయారు. గల్లంతైన ముగ్గురు కోసం జాలర్లు, పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా.. సాయివర్ధన్ మృతదేహం లభ్యమైంది. మరో ఇద్దరికోసం.. గాలింపు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

Last Updated : Apr 2, 2022, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details