భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సీతారాంపట్నం 133/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో అగ్నిప్రమాదం సంభవించింది. మూడు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
TRANSFORMERS BLAST: విద్యుత్ సబ్స్టేషన్లో పేలిన ట్రాన్స్ఫార్మర్లు.. - transformers blast in badradri district
భద్రాద్రి జిల్లా సీతారాంపట్నం విద్యుత్ సబ్స్టేషన్లో మూడు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయి. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపు చేశారు.
విద్యుత్ సబ్స్టేషన్లో పేలిన ట్రాన్స్ఫార్మర్లు..
అప్రమత్తమైన విద్యుత్ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి కారణాలు ఏంటనే అంశంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక లోపాలా? అధిక లోడు వల్ల ఏర్పడిన ఒత్తిడికి ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
Loan App Case: నకిలీ సైబర్ క్రైం ఎస్సై వ్యవహారంలో కొత్త విషయాలు