ఈతకు దిగిన ముగ్గురు విద్యార్థులు గల్లంతు - ప్రాణహిత నదిలో పడి గల్లంతు
![ఈతకు దిగిన ముగ్గురు విద్యార్థులు గల్లంతు Three students](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14209069-423-14209069-1642414286111.jpg)
15:28 January 17
ఈతకు దిగిన ముగ్గురు విద్యార్థులు గల్లంతు
Students drown in Pranahitha River : ఈత కోసం ప్రాణహిత నదిలో దిగిన ముగ్గురు విద్యార్థులు కొట్టుకుపోయారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆల్గాం సమీపంలో సాయి, వంశీ, రాకేశ్ ఈత కోసం నదిలోకి దిగారు. ముగ్గురూ గల్లంతవగా గాలింపు చేపట్టారు.
మరోవైపు... కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు యువకులు నీటిలో మునిగిపోయారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం అడ్లూరు సమీపంలో నదిలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతవగా.. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి :ఈనెల 30 వరకు పరీక్షలు వాయిదా.. ఆన్లైన్ క్లాసులు ప్రారంభం