Students missing in Swarnamukhi: ఏపీలోని చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం జి.పాలెం సమీపంలో స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈతకోసం మొత్తం నలుగురు విద్యార్థులు వెళ్లగా.. వారిలో జి.పాలెం ఎస్సీ కాలనీకి చెందిన ధోని(16), గణేష్(15), యుగంధర్(14) గల్లంతయ్యారు. లిఖిత్ సాయి మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు.
స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లి.. ముగ్గురు విద్యార్థులు గల్లంతు! - three students missing in river
Students missing in Swarnamukhi: ఏపీలోని చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం జి.వి.పాలెం సమీపంలోని స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. నదిలో ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థుల్లో ముగ్గురు గల్లంతు కాగా.. ఓ విద్యార్థి క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నాడు. మిగిలిన వారి కోసం పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు.
Students missed
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. కానీ.. ఆచూకీ లభించలేదు. అనంతరం.. రేణిగుంట పోలీసులు, రెస్క్యూ టీం స్వర్ణముఖి నది వద్దకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి:Father Suicide After Son's Death : కుమారుడి మృతి తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య