Three Students Died: హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. మల్కారం ఈదుళ్ల చెరువులో ఈత కోసం వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మొత్తం ఆరుగురు విద్యార్థులు ఈతకు వెళ్లగా.. అందులో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థులకు ఈత రాకపోవడం వల్ల నీటిలో మునిగి మృత్యువాతపడ్డారు.
ఈతకని వెళ్లి.. చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి - jawahar nagar crime news
17:33 March 16
ఈతకని వెళ్లి.. చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి
గబ్బిలాల్పేట్లో నివాసం ఉంటున్న.. యువ చందు, విజయ్, నవీన్.. శిశు జ్ఞాన మందిర్ పాఠశాలలో 6, 7 తరగతి చదువుకుంటున్నారు. పాఠశాల ముగిసిన అనంతరం సరదాగా ఈతకు వెళ్దామని ఆరుగురు విద్యార్థులు బయలుదేరారు. ఈతకు వెళ్లిన ఆరుగురిలో.. ముగ్గురు విద్యార్థులకు ఈత రాకపోవడంతో ప్రమాదం సంభవించింది.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. విద్యార్థుల మృతితో ఒక్కసారిగా జవహార్‌నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసిన జవహార్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: