ఏపీలోని నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంటలో విషాదం జరిగింది. ఆదివారం చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీట మునిగి ప్రాణాలు విడిచారు. సోమవారం ఉదయం ముగ్గురి మృతదేహాలు నీటిపై తేలియాడుతుండగా బయటకు తీశారు.
చెరువులో ఈతకు దిగిన ముగ్గురు పిల్లలు మృతి - ap news
ఏపీలోని నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంటలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు.
బుజబుజ నెల్లూరుకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతులు ఎస్.కె.అలీం(13), పి.సాయి(13), ఎం.రాజేశ్(13) వెంకటాచలం మండలం చెముడుగుంటలోని చెరువులో స్నానానికి దిగారు. చెరువుగట్టుపై దుస్తులు చూసి వారు గల్లంతైనట్లు స్థానికులు గుర్తించారు. ఆదివారం రాత్రి నుంచి వెంకటాచలం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం ముగ్గురి మృతదేహాలు చెరువులో నీటిపై తేలుతూ కనిపించాయి. స్థానికుల సహాయంతో పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు.
ఇదీ చూడండి:కాల్వలోకి దూసుకెళ్లిన కారు... ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి