సూర్యాపేట-జనగామ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టగా ముగ్గురికి గాయాలైన ఘటన... సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాలెంల గ్రామానికి చెందిన పల్లపు కోటేశ్ బైక్‌పై తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి తిరుమలగిరి నుంచి గ్రామానికి వెళ్తున్నారు.
కారు, ద్విచక్రవాహనం ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు - Suryapet district latest news
కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా ముగ్గురికి గాయలైన ఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
![కారు, ద్విచక్రవాహనం ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు Three persons were injured in a car accident in Suryapet district, suryapet district accident news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11253985-967-11253985-1617366698895.jpg)
సూర్యాపేట జిల్లాలో కారు, ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురికి గాయాలు, సూర్యాపేట జిల్లా రోడ్డు ప్రమాదం వార్తలు
అదే సమయంలో సూర్యాపేట వైపు వెళ్తున్న కారు అధిక వేగంతో వెనుక నుంచి వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంలో గాయపడిన వారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: నమ్మకంగా ఉంటూ.. బంగారు నగలు దోచేసింది