ద్విచక్రవాహనం అదుపుతప్పి ముగ్గురికి తీవ్రంగా గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం వెంపల్లి వద్ద చోటు చేసుకుంది. బైక్‌పై సిర్పూర్ వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కాగజ్‌నగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అదుపుతప్పిన ద్విచక్ర వాహనం.. ఒకరి పరిస్థితి విషమం - ద్విచక్రవాహనానికి ప్రమాదం
ద్విచక్రవాహనం అదుపుతప్పి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం వెంపల్లి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను కాగజ్‌నగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
వెంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
కాగజ్‌నగర్‌లోని పోచమ్మ బస్తీకి చెందిన బాల వేణుప్రసాద్ (24), సంఘం బస్తీకి చెందిన రాజేశ్వరి (19), కావేరి (16) ద్విచక్రవాహనంపై సిర్పూర్ బయలుదేరారు. వెంపల్లి వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి కిందపడగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో వేణు ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.