ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో అప్పు వివాదంతో ఓ వ్యక్తిపై ముగ్గురు విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
'నెల్లూరుకు చెందిన ప్రసాద్ రావుకు సాయి జగదీశ్ కొంత డబ్బు అప్పు ఇచ్చాడు. డబ్బులు తిరిగి చెల్లించకపోవటంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. సాయి జగదీశ్‌ను ప్రసాద్ రావు కొట్టాడు. కొన్ని రోజుల తరువాత డబ్బు తిరిగి చెల్లించాడు. ఈ క్రమంలో ఈ నెల 24న నగరంలోని బాబూ జగజ్జీవన్ రామ్ కాలనీలో ఒంటరిగా ఉన్న ప్రసాద్ రావుపై జగదీశ్.. తన మిత్రులు సతీష్, అబ్ధుల్ అజీబ్లతో కలిసి దాడి చేశాడు. ఇటుక రాళ్లతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు' అని నెల్లూరు డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.