Three persons died: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద ఉన్న జాతీయ రహదారిపై వస్తున్న ఆటో... ఒక్కసారి అదుపుతప్పింది. డివైడర్ ఎక్కి అవతలి రహదారిపైకి వెళ్ళింది. అటు నుంచి వస్తున్న టిప్పర్.. ఒక్కసారిగా ఎదురొచ్చిన ఆటోను బలంగా ఢీకొంది. ప్రమాద సమయంలో ఆటోలో నలుగురు ఉండగా.. ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో తోషిబా పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నా తిరుమలవాసు, పటాన్చెరు జేపీ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ సాయి బన్నన్ మృతి చెందారు. ఇంకొకరి వివరాలు తెలియాల్సి ఉంది.
Three persons died: అదుపుతప్పి టిప్పర్‌ను ఢీకొన్న ఆటో.. ముగ్గురు దుర్మరణం - రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
Three persons died: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ జాతీయ రహదారిపై వెళుతున్న ఆటో అదుపుతప్పి అవతల రహదారిపైకి వెళ్లడంతో టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృత్యువాత పడగా.. మరో ప్రయాణికునితో పాటు పాదచారి గాయపడ్డాడు.
ఆటోను ఢీకొన్న టిప్పర్, ముగ్గురు మృతి
ఇదే ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు కిరణ్‌తో పాటు.. అదే సమయంలో రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న సోనీకి గాయాలయ్యాయి. క్షతగాత్రులిద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ రమణ కుమార్, డీఎస్పీ పరిశీలించి ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీసీ ఫుటేజ్‌లో ఆటో అదుపు తప్పటం.. టిప్పర్ష్ ఢీకొనడం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇవీ చూడండి:
Last Updated : Jan 6, 2022, 1:29 AM IST