హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రి సమీపంలో అధిక ధరలకు బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 30 అంఫోటెరిసిన్ ఇంజక్షన్లు, మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
ARREST: బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల విక్రయం.. ముగ్గురు అరెస్ట్ - ముగ్గురు అరెస్ట్
నగరంలో మెడికల్ దందా కొనసాగుతోంది. అధిక డబ్బులు సంపాదించాలన్న దుర్బుద్ధితో ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. తాజాగా పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రి సమీపంలో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్
యూసుఫ్‌గూడలో ఔషధ దుకాణం నిర్వాహకుడు పోతుగంటి ముకుందారావు, గార్మెంట్స్ వ్యాపారం చేసే కడియాల చిరంజీవి, కాకర్లపల్లి సతీశ్ కలిసి రూ.7800 విలువ చేసే ఒక్కో అంఫోటెరిసిన్ ఇంజక్షన్ రూ.35 వేలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడి చేసి పట్టుకున్నామని టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తెలిపారు.