సెల్లార్ గుంత తీస్తుండగా గోడ కూలి ఇద్దరు మృతి
16:29 June 25
పుప్పాల్‌గూడలో ఇద్దరు మృతి
రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో సెల్లార్ పనులు చేస్తుండగా గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ సాయంతో రెండు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులు శ్రీకాకుళానికి చెందిన ప్రసాద్, వెంకటరమణగా గుర్తించారు. నిర్మాణసంస్థపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 4గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టు తమకు సమాచారం వచ్చిందని, వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టామని నార్సింగ్ ఇన్స్పెక్టర్ శివకుమార్ వివరించారు.
ప్రమాదం జరిగిన సమయంలో 13 మంది కార్మికులు పనిచేస్తున్నారని, నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోందన్నారు. ఘటనలో మొదట ముగ్గురు కూలీలు చిక్కుకున్నారని భావించారు. మట్టి కింద ఇంకా ఎవరూ లేకపోవడంతో పాటు ఈరోజు 13 మంది పనిలోకి రాగా 11 మంది అక్కడ ఉన్నారని గుర్తించారు. మిగతా వారి గురించి ఆరా తీసి ఇద్దరు మాత్రమే మృతిచెందినట్టు నిర్ధారణకు వచ్చామని ఇన్స్పెక్టర్ శివకుమార్ వెల్లడించారు.
ఇవీ చూడండి: