ఆలయంలో విషాదం.. విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి - Electric shock in Temple
13:55 May 28
నల్గొండ జిల్లాలో విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి
Electric shock in Temple: నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని రామాలయం వద్ద ఇనుప రథాన్ని తీసే క్రమంలో విద్యుదాఘాతం కారణంగా ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గ్రామంలో ఇటీవల రాముల వారి ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల అనంతరం స్వామి వారి ఊరేగింపు చేసే రథం ఆలయ సమీపంలో ఉండగా.. ఆ రథాన్ని ఆలయంలోకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో పైన విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో మరో ఇద్దరికి గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం అంబులెన్సులో వారిని నాంపల్లి ఆస్పత్రికి తరలించారు. దుర్ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి:నానక్‌రాంగూడలోని బావర్చి హోటల్లో అగ్నిప్రమాదం
పెళ్లి వీడియో వైరల్ చేసిన యువతి.. రక్షణ కల్పించాలని పోలీసులకు వినతి