స్నేహితులతో సరదాగా స్నానానికి వెళ్లి.. చెరువులో గల్లంతయ్యాడు.. - ts news
18:34 March 18
స్నానానికి వెళ్లి.. చెరువులో ఓ వ్యక్తి గల్లంతు
సరదాగా స్నేహితులతో కలిసి చెరువుకు స్నానం కోసం వెళ్లారు. అందరూ కలిసి నీళ్లలో కేరింతలు కొట్టారు. ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది. ఆ నీరే వారి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగుల్చుతాయని తెలుసుకోలేక పోయారు. స్నానానికి వెళ్లిన నలుగురిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రేగులగండిలో చోటుచేసుకుంది.
గల్లంతైన యువకుడు కూనవరం వాసిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: